WNP: దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని BRS నాయకులు కలెక్టరేట్లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ యాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కేవలం సన్న ధాన్యం మాత్రమే కొంటున్నారని, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. BRS జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.