WNP: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఈ చీరలను ప్రతి జిల్లా నుంచి మహిళా సమాఖ్య అధ్యక్షులు హైదరాబాద్ వెళ్లి ఎంపిక చేశారని తెలిపారు. ఈ చీరల తయారీలో పదివేల మంది నేతన్నలు శ్రమించారని గుర్తు చేశారు. జిల్లాలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణం త్వరలో పూర్తవుతుందని ఆయన తెలిపారు.