KRNL: సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 – మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.