GNTR: మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం మేడికొండూరు మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పేరేచర్ల గ్రామ సమీపంలోని శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్లును ఆయన సందర్శిస్తారు. అక్కడి పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.