WG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం తూర్పుపాలెంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ మంత్రి రంగనాధరాజు పాల్గొని మాట్లాడారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసి, మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.