HYD: జీహెచ్ఎంసీ పాలకమండలి సాధారణ సర్వసభ్య సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో అనుసరించాల్సిన తీరుపై పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ అంశాలపై పార్టీల ముఖ్య నేతలు కార్పొరేటర్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జరగబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.