CTR: కార్వేటినగరం (M) కనుమవద్ద సోమవారం ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. కార్వేటినగరం నుంచి పుత్తూరుకు వెళ్తున్న ట్రాక్టర్కు గేరు మార్చే సమయంలో న్యూట్రల్ కావడంతో వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ను డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సతీష్, సెల్వి మృతి చెందారు.