VZM: సంతకవిటి మండల పరిధి జీఎంఆర్ కేర్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలను పోలీసులు చేశారు. త్రిబుల్ రైడింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి ఫైన్లు వేశారు. ఈ సోదాలు రూరల్ సీఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో జరిగాయి. మొత్తం 12 వాహనాలకు రూ. 2,220, 10 వాహనాల నుంచి పాత చలనాలను రూ.2,530లను వసూలు చేశామన్నారు.