CTR: జిల్లాలో సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయపురం మండలంలో 20.2 మీమీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా గుడిపాలలో 1మీమీ వర్షం కురిసింది. మండలాల వారిగా సదుం- 11.2, పెద్దపంజాణి- 10.6, రొంపిచర్ల, సోమల- 8.6, కార్వేటి నగరం- 8.2, పుంగనూరు 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు అధికారులు పేర్కొన్నారు.