కృష్ణా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయు జిల్లా కోశాధికారి బుర్ర సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. మచిలీపట్నంలోని సీఐటీయు కార్యాలయంలో నిన్న ఆయన మాట్లాడుతూ.. లేబర్ కోడ్లను రద్దు చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన చేపట్టనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.