SDPT: జిల్లా రైతులు మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాల్లో 86 వేల క్వింటాళ్ల మొక్కజొన్నను క్వింటాలుకు రూ.2,400 ధరకు ప్రభుత్వం సేకరించింది. అయితే కొనుగోలు జరిగి నెల దాటినా సొమ్ము జమ కాలేదు. దీంతో పెట్టుబడులు చెల్లించేందుకు డబ్బులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.