KRNL: సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతు ఖాతాలో ఏటా రూ.20 వేలు అందిస్తున్నామని రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున అన్నారు. సోమవారం పెద్దకడబూరులో ఏవో సుచరితతో కలిసి లబ్ధిదారులైన రైతులను వారు కలిశారు. ప్రభుత్వ పనితీరును వివరించి, మరోసారి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.