WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద స్థానిక ఎస్సై హిమబిందు సోమవారం విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఆటోలలో పరిమితికి మించి కూలీలను ఎక్కించరాదని ఆమె హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రామకృష్ణ, వాసు పాల్గొన్నారు.