W.G: ఆకివీడు మండలం కుప్పనపూడిలోని రొయ్యల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడం ద్వారా రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. గ్రామానికి చెందిన మారు బోయిన రాంబాబు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన అన్నారు