MBNR: అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం 3వ హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు సమర్పించిన కానుకలు మొత్తం రూ.30,58,980 ఆదాయం వచ్చినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ లెక్కింపులో పాలకమండలి సభ్యులు, సేవకులు, అర్చకులు పాల్గొన్నారు.