HYD: బాచుపల్లి-మియాపూర్ రోడ్డులో మమత మెడికల్ సర్వీసెస్ అకాడమీ ఆసుపత్రి ఎదుట గుర్తు తెలియని యువకుడు ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ విషయాన్ని గమనించి డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలక్ట్రికల్ పోల్కు అమర్చిన వైర్ సహాయంతో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.