MBNR: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.