టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడేందుకు ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితి కారణమని పలాశ్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో తమ కుటుంబాల గోప్యతకు గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. నిన్న ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లి వాయిదా పడినట్లు మేనేజర్ తుహిన్ మిశ్రా ప్రకటించిన విషయం తెలిసిందే.