నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ సునీల్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. నేడు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 82 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.