దేశంలో స్పామ్, మోసపూరిత కాల్స్‌ను అరికట్టేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్యలు చేపట్టింది. గడిచిన ఏడాది కాలంలో 21 లక్షలకు పైగా మొబైల్ నెంబర్లను డిస్కనెక్ట్ చేయడంతోపాటు, మోసాలకు పాల్పడుతున్న సుమారు లక్ష సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ప్రకటనలో వెల్లడించింది.