కాకినాడ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఎస్పీ జి. బిందు మాధవ్ జిల్లాలోని నేరాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న వివిధ నేర సంబంధ కేసులు, శాంతి భద్రతలు పరిరక్షణ, వివిధ అసాంఘిక కార్యకలాపాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.