WNP: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోట మండలం పాలెం గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. మహిళల కోసం ప్రభుత్వం సమైక్య ద్వారా రుణాలు ఇవ్వడం ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ నేతలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.