KRNL: రైతుల సేవలో కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సోగనూరు బోయ జగదీశ్, కలగట్ల కొండన్న గౌడ్, కలగట్ల శంకర్ గౌడ్ అన్నారు. సోమవారం కలగట్లలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ నిధులు పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.