SKLM: పోషకాహార భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతిస్తుందని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. సరుబుజ్జిలి మండల కేంద్రంలో పొదుపు సంఘాల మహిళలకు చిరు ధాన్యాల వాడకం, వినియోగ పై శిక్షణా తరగతులను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. చిరుధాన్యాల వంటలో వినియోగం పెరిగితే కుటుంబ ఆరోగ్యం మరింత మెరుగవుతుందని అన్నారు. అనంతరం పలు స్టాల్స్‌ను సందర్శించారు.