కృష్ణా: కొండపల్లి మున్సిపాలిటీకి కొత్త ఇంచార్జ్ కమిషనర్ గా వి. వెంకటరత్నంను నియమిస్తూ మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇదే మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటరత్నకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పరిధిలోని కొండపల్లి మున్సిపాలిటీకి వర్తిస్తుంది.