AP: పారిశ్రామికాభివృద్దితోపాటు హార్టికల్చర్ పెరగాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సీమ రైతులకు సిరుల సాగు.. హార్టికల్చర్ పంటలతోనే సాధ్యమన్నారు. పంటల ద్వారా సంపద సృష్టించొచ్చని రైతులు నిరూపించాలన్నారు. కియాతో జరిగిన అభివృద్ధి.. ఉద్యాన పంటలతోనూ జరగాలని సూచించారు.