MDK: శివంపేట మండలం గోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలను చేపట్టారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలలో పాల్గొన్నారు. అనంతరం ఇందిర మహిళా శక్తి చీరలను మహిళలకు అందజేశారు. నాయకులు మాధవరెడ్డి, వెంకట్రాంరెడ్డి, నవీన్ గుప్తా, లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.