W.G: ఆక్వా చెరువులు, వరి పంట పొలాల్లో విద్యుత్ మోటార్ల చోరీలను అరికట్టాలని కోరుతూ రైతులు సోమవారం నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేదను కలిశారు. మొగల్తూరు పోలీస్ పరిధిలోని గ్రామాల్లో పదుల సంఖ్యలో చోరీలు జరిగి, లక్షల విలువైన సామగ్రి అపహరించుకు పోయిందని డీఎస్పీకి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన డీఎస్పీ శ్రీవేద, దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.