SRD: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అమీన్పూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించారు.