AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఇవాళ జరిగే పంచమీ తీర్థంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 50 వేల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో దాదాపు 150 అన్నప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం 63 LED స్క్రీన్లు అమర్చారు.