NTR: చందర్లపాడు మండలం కోనాయపాలెం వద్ద ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి కాలువలోకి దిగిపోయింది. విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి, వారిని సురక్షితంగా కిందకు దింపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరైన రోడ్డు మార్జిన్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.