NGKL: పారదర్శక పాలన అందించేందుకే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి సోమవారం ఆయన 31 అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.