ADB: మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని రేపట్లోగా పూర్తి చేయాలని జిల్లాలోని అధికారులను ఆదేశించారు.