MBNR: పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కవాతు మైదానం ప్రాంగణంలో ఈ నెల 26 న పాత సామాన్ల వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. ఈ వేలంలో పాత కంప్యూటర్లు, యూపీఎస్, ప్లాస్టిక్ లాటీలు, నెట్ కేబుల్స్, ఇనుప బీరువాలు, ఇతర సామాన్లు వేలం వేయబడతాయి. ఆసక్తి గల బిడ్డర్లు వివరాలకు ఎస్సై స్టోర్ కృష్ణయ్య (87126 59328)ను సంప్రదించాలన్నారు.