NDL: నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ మరమ్మతులకు కలెక్టర్ రూ.38 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నాగటూరు కమిటీ కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మండల కన్వీనర్ మోహన్ రెడ్డి పగిడాల మండల కన్వీనర్ పలుచని మహేశ్వరి రెడ్డి అక్కాపురం సమీం చిన్నయ్య ఖాదర్ పాల్గొన్నారు.