NTR: విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అనంతరం తిరుగు పయనమైన తణుకుకు చెందిన భవానీ భక్తుడు కుక్కు నూని జయరామ్ (33) చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై కోడూరుపాడు ఫ్లైఓవర్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొనడంతో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆయన స్నేహితుడు అల్లబూని సాయితేజ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.