W.G: భీమవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల డ్రైవింగ్ స్కూల్‌ను ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్ సోమవారం ప్రారంభించారు. 32 రోజుల కాలపరిమితితో 16 మందితో మొదటి బ్యాచ్‌కు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆరుగురిని ఎంపిక చేశామన్నారు. ఈ శిక్షణ ద్వారా వారిని హెవీ వెహికల్ డ్రైవర్లుగా తీర్చిదిద్దుతామని ఆర్ఎం పేర్కొన్నారు.