కాకినాడ నగరంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సోమవారం హెచ్చరించారు. చీడీల పొర, బీచరోడ్డు విముక్తి స్కూల్కు ఉత్తరం వైపున గోడారిగుంటకు వెళ్లే దారిలో కొందరు ఆక్రమణలకు యత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని కలెక్టర్ ప్రకటించారు.