GNTR: తెనాలి పట్టణంలోని కబేలా వంతెన నుంచి ముత్యంశెట్టిపాలెం మీదుగా బాబా టవర్స్ వైపు వెళ్లే రోడ్డును మంగళవారం నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఇక్కడ నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా అధికారులు టేక్ డైవర్షన్ బోర్డులు పెట్టారు. దీంతో ఇటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఇతర మార్గాల మీదుగా వెళ్లాలని అధికారులు తెలిపారు.