AKP: పాయకరావుపేట మండలం పెదరామభద్రపురంలో జరుగుతున్న రైతు వారోత్సవాలలో భాగంగా మంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆమె డ్రోన్ సాయంతో సేంద్రీయ ఎరువుల పిచికారీ చేయడంతో పాటు వరి పొలంలోకి దిగి స్వయంగా డ్రోన్‌ను ఆపరేట్ చేసి పంట పరిస్థితులను పరిశీలించారు. పాయకరావుపేట నియోజకవర్గ రైతులకు ₹25.60 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.