KNR: రైతులు పండించిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సీజన్లో దిగుబడి లేక, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.