ADB: ఉద్యాన విద్యార్థులకు రైతు సమస్యలపై అవగాహన ఉండాలని ఐటీడీవో హార్టికల్చర్ ఆఫీసర్ గుడిమళ్ల సందీప్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విషయ పరిజ్ఞానం పెంచుకోని, భవిష్యత్తులో రైతులకు ఉపయోగ పడే శాస్త్రావేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.