ASF: విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో గెలుపొందిన జిల్లా జట్టును అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.