నంద్యాల జిల్లా ఎస్పీ సునీలకు ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని ఇమాన్యుల్ అనే వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని కాశమ్మ ఫిర్యాదు చేశారు. ఫిర్యా దుల్లో ఎక్కువగా సివిల్ కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చట్టపరిధిలో పరిష్కారం అయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.