KRNL: దేవనకొండ మండల విద్యాశాఖ కార్యాలయం కీలక సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు MEO తిమ్మారెడ్డి వెల్లడించారు. అకౌంటెంట్ ఒకటి, CLRP రెండు పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యాలయ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు పేర్కొన్నారు.