గుంటూరులోని కృష్ణనగర్ 5వ లైను, కుందుల రోడ్డు పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఏఈ గురవయ్య తెలిపారు. రహదారి విస్తరణ, చెట్టుకొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ నేపథ్యంలో విద్యత్ అంతరాయం ఉంటుందన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.