SKLM: కోటబొమ్మాలి మండలం పాకివలసలో సోమవారం నాగుపాము (గోధుమనాగు) హల్ చల్ చేసింది. దీంతో ప్రజలు చూసేందుకు ఎగబడ్డారు. చెట్లు పొదల్లో నుంచి బయటకు వచ్చి జంగిల్ ఉన్న స్థానంలో కాసేపు పడగ విప్పుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత ఒక పిల్లి కనిపించడంతో బుసలు కొడుతూ దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పిల్లి పరుగులు తీసింది.