ASF: జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలు సాగు చేసిన కేసులో నిందితుడు పాండురంగకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధిస్తూ ASF సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. నిందితుడికి శిక్ష ఖరారయ్యేలా కృషి చేసిన పోలీసులను ఆమె అభినందించారు.