AP: మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. మన అమ్మాయిల బలం, దృఢ సంకల్పానికి ఈ విజయం నిదర్శనమని ఆయన ‘X’ వేదికగా పోస్ట్ చేశారు. అదేవిధంగా, వరుసగా రెండోసారి మహిళా కబడ్డీ ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం దేశానికి గర్వకారణమైన క్షణం అని మంత్రి లోకేష్ తెలిపారు.