భారత మహిళా కబడ్డీ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘2025 కబడ్డీ ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా దేశం గర్వపడేలా చేశారు. అత్యుత్తమ ధైర్యాన్ని, నైపుణ్యాలను, అంకితభావాన్ని ప్రదర్శించారు. వారి విజయం లెక్కలేనన్ని యువత కబడ్డీని కొనసాగించడానికి, పెద్ద కలలు కనడానికి, ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరణనిస్తుంది’ అని ‘X’లో రాసుకొచ్చారు.